ETV Bharat / state

'పస్తులుంటున్నాం సార్.. మమ్మల్ని స్వగ్రామాలకు పంపండి' - లాక్ డౌన్​తో వలస కూలీల కష్టాలు

ఉపాధి కోసం వచ్చి లాక్ డౌన్ కారణంగా పనుల్లేక నెలరోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కృష్ణా జిల్లాలో ఉన్న కర్నూలు వలస కూలీలు వాపోయారు. తమను స్వగ్రామాలకు పంపించాలని అధికారులను వేడుకున్నారు.

migrant labours troubles in krishna district due to lockdown
కృష్ణా జిల్లాలో వలస కూలీల కష్టాలు
author img

By

Published : May 7, 2020, 1:58 PM IST

ఉపాధి కోసం కృష్ణా జిల్లా గన్నవరం మండలం మర్లపాలానికి వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కర్నూలు జిల్లా వలస కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా మద్దికెర మండలం పత్తికొండ తాలూకా మదనంతపురం నుంచి పొట్టకూటి కోసం ఇక్కడకు వచ్చామని చెప్పారు. లాక్ డౌన్​తో పనులు లేక దాదాపు నెల రోజులుగా ఒకపూట తిని మరోపూట పస్తులుంటున్నామని వాపోయారు.

మరోవైపు తమ జిల్లాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇళ్ల దగ్గర కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారో అని ఆందోళన చెందుతున్నామన్నారు. తమను స్వగ్రామాలకు పంపాలని అధికారులను వేడుకున్నారు.

తహసీల్దార్ మురళీకృష్ణ స్పందిస్తూ.. మండలంలో ఉన్న సుమారు 500 మంది వలస కూలీల విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. 2, 3 రోజుల్లో వారిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తామన్నారు.

ఇవీ చదవండి:

విజయనగరంలోనూ కరోనా.. రాష్ట్రంలో మరో 56 కేసులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.