రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గడం లేదు. కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,833కు చేరింది. ఇన్నాళ్లూ ప్రశాంతంగా ఉన్న విజయనగరం జిల్లా కూడా ఈ వైరస్ బారిన పడింది. తొలిసారి 3 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఈ జిల్లాలో బలిజపేట, సీతానగరం మండలాలకు చెందిన మహిళలకు కరోనా నిర్ధరణ అయింది.
కరోనా బారిన పడి రాష్ట్రంలో మరో ఇద్దరు మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 38కి చేరింది. 780 మంది కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. 1,015 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి: