కృష్ణా జిల్లా పోలీసు శాఖలో పని చేస్తున్న పోలీసు సిబ్బంది పిల్లల ఉన్నత చదువులకై ప్రోత్సాహం కల్పించేందుకు ఎస్పీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పోలీసు శాఖలో పనిచేస్తున్న 27 మంది పోలీసు సిబ్బంది పిల్లలకు మెరిటోరియస్ స్కాలర్ షిప్ లను అందించి ఉత్తేజపరిచారు.
జిల్లాలో పదవ తరగతి నుండి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, టెక్నికల్ విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ_మెరిటోరియస్ స్కాలర్ షిప్ లు అందజేస్తున్నామని ఎస్పీ తెలిపారు. అదే విధంగా తల్లిదండ్రులు పిల్లలపై పెట్టుకున్న ఆశలను తీర్చేవిధంగా మంచి చదువులు చదివి వివిధ హోదాలలో అధికారులుగా చూడాలన్నదే తన ఆశ అని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి కరోనా ఫలితాల కోసం వెయిట్ చేయలేకపోతున్నారా..అయితే ఇలా చేయండి