తమ సమస్యలను పరిష్కారించాలని కోరుతూ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గీతా ప్రసాదినితో ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు సమావేశమయ్యారు. కొవిడ్ సమయంలో తమకు ఎదురవుతున్న సమస్యలను డైరక్టర్‌కు విన్నవించారు. మెడికల్ అండ్ హెల్త్ విభాగంలో జాయింట్ కలెక్టర్ల ప్రమేయాన్ని తగ్గించాలని కోరినట్లు ఏపీ వైద్యుల సంఘం రాష్ట్ర కన్వీనర్ డా.జయధీర్ ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే కొవిడ్ సమయంలో విధులు నిర్వహిస్తూ మరణించిన వైద్యుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇస్తూ జీవోను విడుదల చేయాలని కోరామని వెల్లడించారు.
వారి విజ్ఞప్తులు మరికొన్ని...
- వైద్య బోధన సిబ్బంది, జూడాలకు ప్రత్యేకంగా కరోనా నిర్ధరణ పరీక్షలు చేసి వెంటనే ఫలితాలు తెలపాలి
- ప్రతి జిల్లాలో 100 పడకలతో కూడిన ప్రత్యేక ఐసోలేషన్, క్వారంటైన్లను ఏర్పాటు చేయాలి
- ఇతర రాష్ట్రాలతో సమానంగా అలవెన్సులు, ఇతర భత్యాలను ఇవ్వాలి
- కొవిడ్ సమయంలో వినియోగించిన వాహనాల అలవెన్సులను వెంటనే విడుదల చేయాలి
- కొవిడ్ విధులు నిర్వహిస్తున్న వైద్యుల గౌరవాన్ని కాపాడాలి
- ఇతర శాఖల ఒత్తిడి తగ్గించాలి
- పెండింగ్‌లో ఉన్న బోధనా వైద్యుల బకాయిలను వెంటనే చెల్లించాలి
- పరీక్షల సంఖ్యను పెంచటానికి వైద్య సిబ్బందిపై పెడుతున్న ఒత్తిడిని తగ్గించాలి
ఇదీ చదవండి: