ETV Bharat / state

పది రూపాయల వ్యయంతో 50 కిలో మీటర్ల ప్రయాణం- విజయవాడ కుర్రాడి ఐడియా!

mechanic made a battery vehicle: విద్యుత్‌ వాహనాలు కొనుగోలు చేయాలంటే అధిక ధరలు వసూలు చేయడం... వాటి నుంచి ఉపశమనం పొందేందుకు ఓ మెకానిక్ తన ప్రతిభకు పదును పెట్టాడు. అనుకున్నదే తడవుగా బ్యాటరీతో నడిచే వినూత్న వాహనం తయారు చేశాడు. ఆ బ్యాటరీ వాహనం ప్రత్యేకతలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

mechanic made a battery vehicle
mechanic made a battery vehicle
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 5, 2023, 10:49 PM IST

mechanic made a battery vehicle: అసలే పేదరికం, చదివింది అంతంతా మాత్రమే.. పైగా పెరుగుతున్న నిత్యావసర ధరలు గుదిబండల మారి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అతడిది. దొరికిన కొద్దిపాటి పనితో ఎలాగోలా కుటుంబాన్ని పోషించాలనే తాపత్రయం పడ్డాడు. కానీ, ఇంధన ధరలు పెరగటం మూలానా పని కోసం ఖర్చు చేసే రవాణా చార్జీలు రోజురోజుకు పెరుగుతూ భారంగా మారాయి.దాంతో బ్యాటరీతో నడిచే వినూత్న వాహనం తయారు చేశాడు. మరి, ఇందంతా అతడికి ఎలా సాధ్యమైంది..? ఆ బ్యాటరీ వాహనం ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

నిత్యవసర సరుకుల్లో ఒకటిగా భావించే వాహనాల్లో ఉపయోగించే ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కేవలం ఈ ధరలను దృష్టిలో ఉంచుకొని ఆ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. మధ్యతరగతి, సామాన్య ప్రజలకు ఊరట కల్పించటానికి తన వంతుగా కృషి చేసి... ఆటో మోబైల్‌ రంగంలో సరికొత్త ఆవిష్కరకు నాంది పలికాడు మోర్ల వెంకటేశ్వరరావు. కృష్ణ జిల్లా కంకిపాడుకు చెందిన వెంకటేశ్వరరావు కుటుంబ ఆర్థిక పరస్థితుల కారణంగా పదొవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. తర్వాత వెంకటేశ్వరరావు బ్యాటరీ మరమ్మతులు.. చేసి వాహనాలకు అమర్చే వృత్తిని ఎంచుకున్నాడు. ఆ పనిపై ఇరవై ఏళ్ల అనుభవాన్ని సొంతం చేసుకున్నాడు.

Young Boy 3D Art with Technology: శిల్పకళకు సాంకేతిక త్రీడీ హంగులు.. జీవం ఉట్టిపడుతున్న విగ్రహాలు

ఈ క్రమంలో అతడు నిరంతరం ఇంటి నుంచి షాప్‌కు రాకపోకలు కొనసాగించేవాడు. దీంతో రవాణా ఖర్చులకు అతడు రోజుకు యాభై రూపాయలు భరించాల్సి ఉండేది.. దానిని వెంకటేశ్వరరావు అదనపు భారంగా భావించాడు. దాన్ని తగ్గించుకునేందుకు తన అనుభవాన్ని జోడించి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. తాను ఎదుర్కొంటున్న భారాన్ని తన చుట్టు ఉన్న వారు అనుభవించటం... వెంకటేశ్వరరావు గమనించాడు. ముఖ్యంగా మోపెడ్‌పై ఊరురా తిరుగుతు చిన్న చితకా వ్యాపారాలు చేసుకొనే వ్యాపారులకు.. పెరుగుతున్న ధరల వల్ల వచ్చిన ఆధాయం అంతా వాటికే సరిపోతుందని తెలుసుకున్నాడు. విద్యుత్‌ వాహనాలు అంతే మొత్తంలో అధిక ధరలు వసూలు చేయడం... వాటి నుంచి ఉపశమనం పొందేందుకు మరో మార్గాన్ని అన్వేషించాడు

ఆసియాక్రీడల్లో అదరగొట్టిన విజయవాడ కుర్రాడు - విలువిద్యలో రజతం సాధించిన ధీరజ్‌

ఇరవై ఏళ్ల అనుభవాన్ని తను అనుకున్న ప్రయోగానికి జోడించి ఆ విధంగా అమలు చేశాడు. పాత మోపెడ్‌ వాహనానికి బ్యాటరీ సహాయంతో విద్యుత్‌ మోటార్‌ను అమర్చాడు. తాను ఏవిధంగా రూపొందించాలనుకున్నాడో ప్రణాళికను రచించాడు. మధ్యలో వచ్చే ఆటు పోట్లని తట్టుకొని, దానికొక రూపం దాల్చి... అందరి దృష్టి తన వైపు తిప్పుకున్నాడు. వాహన రూపకల్పనకు 30వేలకు పైగా ఖర్చు చేశామని వెంకటేశ్వరరావు తెలిపారు. పాత వాహనానికి ఈ విధంగా రూపుదిద్దడం వీటికి అనుకూలంగా అదనపు హంగులతో మార్పులు చేసి ఈ మోపెడ్‌ను తయారు చేశాడు. ఈ మోపెడ్‌కు మూడు గంటల పాటు చార్జింగ్‌ చేస్తే 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా రూపొందించినట్లు వెంకటేశ్వరరావు తెలిపారు. ఇది తన ఒకడి రూపకల్పన కాదని.. సామాన్య మధ్యతరగతి ప్రజలకు అధిక ధరల నుంచి ఊరట కల్పించే ఆవిష్కరణ అని పేర్కొన్నాడు. ఇప్పటికే ఈ మోపెడ్ వాహనాలను పలువురు కొనుగోలు చేశారు. దాంతో మరింత ఉత్సాహంగా ఉన్నాడు. మరిన్ని విద్యుత్‌ వాహనాలు రూపొందించాలని... భవిష్యత్తులో ఇవే కాక హై మోడల్‌ ద్విచక్ర వాహనాలను కూడా ఈ విధంగా మార్చాలా ప్రయత్నాలు చేయనున్నట్లు తెలిపాడు.

Bezawada Brothers Success Story: ఇష్టపడిన రంగంలో కష్టపడుతూ ఉన్నతశిఖరాన..! 'బెజవాడ బ్రదర్స్' చాలా ఫేమస్ గురూ..!

పది రూపాయల వ్యయంతో 50 కిలో మీటర్ల ప్రయాణం- మెకానిక్ ఐడియా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.