ETV Bharat / state

'కరోనా నిబంధనలు పాటిస్తూ వైద్య విద్య పరీక్షలు నిర్వహించాం' - NTR Health University bds exams updates

కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు వైద్య విద్య పరీక్షలు నిర్వహించామని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ డా. దుర్గా ప్రసాద్ తెలిపారు. మొదటి సంవత్సరం వైద్య విద్య చదివే విద్యార్ధులకు నవంబర్ నుంచి తరగతులు ప్రారంభమైతే జనవరిలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

Mbbs Exams conducted with Precautions
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ డా. దుర్గా ప్రసాద్
author img

By

Published : Oct 21, 2020, 11:26 PM IST

మార్చి, ఏప్రిల్​లో జరగాల్సిన వైద్య విద్య పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. లాక్​డౌన్ సడలింపుతో పరీక్షల నిర్వహణ ప్రక్రియను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు ప్రారంభించారు. విడతల వారీగా ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్, పీజీ వైద్యకు సంబంధించిన రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించామని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ డా. దుర్గా ప్రసాద్ తెలిపారు.

ఎంబీబీఎస్, బీడీఎస్ కొన్ని తరగతుల పరీక్షలను నవంబర్​లో నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో 20 వేల మంది విద్యార్ధులు వివిధ పరీక్షలకు హాజరై ఉంటారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించామన్నారు. కోవిడ్ సోకిన విద్యార్ధులకు పీపీఈ కిట్లు ధరించి ప్రత్యేక గదుల్లో రాసే విధంగా చర్యలు తీసుకున్నట్లు సీవోఈ తెలిపారు.

మొదటి సంవత్సరం వైద్య విద్య చదివే విద్యార్ధులకు నవంబర్ నుంచి తరగతులు ప్రారంభమైతే జనవరిలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

ఇదీ చూడండి:

పోలీసు అమరులూ.. మీకు జోహార్లు!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.