ETV Bharat / state

టెన్త్ పరీక్షల్లో కొనసాగుతున్న మాస్​ కాపీయింగ్​.. నంద్యాలలో ఆరుగురికి రిమాండ్! - కృష్ణా జిల్లా లేటెస్ట్ అప్​డేట్స్

Mass Copying: నిత్యం ఏదో ఒకచోట పదో తరగతి ప్రశ్నపత్రాల మాస్​ కాపీయింగ్​ ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా.. కృష్ణాజిల్లా డోకిపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాస్ కాపీయింగ్ వెలుగుచూసింది. కొందరు ఉపాధ్యాయుల వద్ద ఇవాళ జరుగుతున్న పరీక్షల ప్రశ్నలకు సెల్ ఫోన్‌లో సమాధానాలను విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై డీఈవో విచారణ జరుపుతున్నారు. అటు నంద్యాల జిల్లాలో ప్రశ్నపత్రం లీకేజీకి కారకులైన ఆరుగురిని పోలీసులు రిమాండ్ కు తరలించారు.

Mass Copying at Dokiparru ZP High School
డోకిపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాస్ కాపీయింగ్
author img

By

Published : May 2, 2022, 2:01 PM IST

Updated : May 2, 2022, 8:28 PM IST

Mass Copying: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాస్ కాపీయింగ్ కలకలం రేపింది. పక్కనే ఉన్న పామర్రు మండలం పసమర్రు జిల్లా పరిషత్ పాఠశాల నుంచి పదో తరగతి పరీక్షకు సంబంధించిన సమాధానాల స్లిప్‌లను పరీక్షా కేంద్రానికి పంపుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. సమాచారం అందుకున్న విద్యాశాఖ, పోలీస్ అధికారులు పసుమర్రు జిల్లా పరిషత్ పాఠశాలకు చేరుకున్నారు. కొందరు ఉపాధ్యాయుల వద్ద సెల్​ఫోన్‌లో సమాధానాలను విద్యాశాఖ అధికారులు గుర్తించారు. డీఈవో తాహిరా సుల్తానా పసుమర్రు చేరుకొని విచారించారు.

టోల్ ఫ్రీ నెంబర్​కు సమాచారం: పసుమర్రు హైస్కూల్ నుంచి ప్రశ్నపత్రాల సమాధానాలు వెళ్తున్నాయని టోల్ ఫ్రీ నెంబర్​కు సమాచారం వచ్చిందని డీఈవో తాహిరా సుల్తానా వెల్లడించారు. పాఠశాలలో ఐదుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు మాల్ ప్రాక్టీస్​కు పాల్పడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. నాలుగు మొబైల్ ఫోన్లలో సమాధానాలు గుర్తించి పోలీసులకు అప్పగించామని తెలిపారు. పోలీసుల విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల ఫోన్లలో 'పేపర్ టైట్, అయాం వెయిటింగ్' అన్న మెసేజ్​లు ఉన్నాయని స్క్వాడ్ అధికారులు తెలిపారు. తాము గుర్తించిన సమాచారాన్ని పోలీసులకు అందించామని... విచారణ అనంతరం పూర్తి వివరాలు పోలీసులు వెల్లడిస్తారని స్పష్టం చేశారు.

ఏలూరు జిల్లాలో : ఏలూరు జిల్లాలోనూ టెన్త్ పరీక్షల్లో అక్రమాలు వెలుగు చూశాయి. విద్యా వికాస్ పాఠశాల కేంద్రంగా అక్రమాల జోరు కొనసాగింది. లెక్కల ప్రశ్నపత్రానికి ఏకంగా అధికారులే జవాబులు తయారుచేస్తూ పట్టుబడడం గమనార్హం. విజయ్‌కుమార్, వరప్రసాద్, ప్రదీప్‌ అనే ముగ్గురిని గుర్తించినట్టు డీఈవో వెల్లడించారు. వీరిలో డీవో వరప్రసాద్‌, ఇన్విజిలేటర్‌ ప్రదీప్‌ను సస్పెండ్ చేసినట్టు ప్రకటించిన డీఈవో.. చీఫ్ సూపరింటెండెంట్‌ విజయ్‌కుమార్ సస్పెన్షన్‌కు సిఫారసు చేసినట్టు తెలిపారు.

ప్రకాశం జిల్లాలో: సీఎస్‌పురంలోని 2 పరీక్ష కేంద్రాల్లో పదోతరగతి పేపర్ లీక్‌ అయినట్టు అధికారులు తేల్చారు. జడ్పీ ఉన్నత పాఠశాల, రత్నం కళాశాల కేంద్రాల్లో అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. ఈ సమయంలో పరీక్షల విధుల్లో ఉన్న నలుగురు అధికారులు, 16 మంది ఇన్విజిలేటర్లను పరీక్షల విధుల నుంచి ఉన్నతాధికారులు తొలగించారు.

నంద్యాలలో ఆరుగురికి రిమాండ్ : నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో గత నెల 29వ తేదీన పదో తరగతి ఆంగ్లం ప్రశ్నపత్రం లీకేజీకి కారకులైన ఆరుగురిని పోలీసులు రిమాండ్​కు పంపించారు. పేపర్ లీకేజీ విషయమై ఆరాతీసిన పోలీసులు.. పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల నుంచి ప్రశ్న పత్రం లీక్ అయినట్లు తేల్చారు. ఇందుకు కారణమైన వసంత కుమార్, రాజు అనే యువకులు తమ స్నేహితుల కోసం ఈ పని చేశారని పోలీసులు తెలిపారు. ముందుగా పరీక్ష హాల్లో నుంచి కిటికీ ద్వారా ఆంగ్ల ప్రశ్నపత్రం బయటకు తీసుకొని, సెల్ ఫోన్ తో ఫొటోలు తీశారని, ఆ తర్వాత.. సమాధానాల కోసం నవనంది పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు సోమ సుందర్ రెడ్డిని కలిశారని తెలిపారు. అతను నవనంది పాఠశాలలో ఆంగ్లం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీధర్, శేషన్నలతో సమాధానాలు తయారు చేయించారు. అనంతరం.. సమాధానాలు రాసిన పత్రాన్ని అమిర్ బాషాకు చెందిన జిరాక్స్ సెంటర్ లో జిరాక్స్ తీయించిన అనంతరం.. వసంత కుమార్, రాజు తమ మిత్రులకు వాటిని అందజేశారని పోలీసులు చెప్పారు. ఈ అక్రమంలో పాలుపంచుకున్న ఆరుగురినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం వారికి రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. వీరికి సహాయపడిన మరో వ్యక్తి నవీన్ కుమార్ రెడ్డిని త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి: మున్సిపల్ ఎన్నికల్లో ఓటేయలేదని.. దాచేపల్లిలో తెదేపా కార్యకర్త ఇంటిపై దాడి

Last Updated : May 2, 2022, 8:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.