''పరీక్ష ప్రారంభమైన అరగంటకే వాట్సాప్ ద్వారా పరీక్ష పేపరు బయటకు వెళ్తోంది. వీటి ఆధారంగానే ప్రైవేట్ విద్యా సంస్థల నిర్వాహకులు పరీక్ష కేంద్రాల ప్రహరీ గోడల చుట్టూ తిరుగుతూ జవాబు పత్రాలను లోపలికి పంపిస్తున్నారు'' అని కొందరు తల్లిదండ్రులు ఈటీవీ - ఈనాడుకు సమాచారం అందించారు. వెంటనే.. ఈనాడు - ఈటీవీ రంగలోకి దిగింది. పరీక్ష కేంద్రాల వద్ద జవాబు పత్రాలు లోనికి పంపిస్తున్న వారిని చిత్రీకరించే ప్రయత్నం చేసింది. గమనించిన కాపీ మాస్టర్లు.. అక్కడి నుంచి పరుగులు పెట్టారు.
విషయాన్ని నూజివీడు విద్యాశాఖ ఉన్నదాధికారుల దృష్టికి తీసుకెళ్లగా... సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.