గుంటూరు వైద్య కళాశాల 1980వ సంవత్సరం బ్యాచ్ విద్యార్థులు కరోనా నియంత్రణకు తమవంతు సాయం అందిస్తున్నారు. సొంతంగా మాస్కులు తయారుచేసి అత్యవసర విధుల్లో ఉన్నవారికి అందిస్తున్నారు. గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో.. విజయవాడలో గ్యాస్ డెలివరీ బాయ్స్‌కు ఫేస్ మాస్కులు, గుడ్డ సెల్ ఫోన్ పౌచ్‌లు అందించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ నోరి సూర్యనారాయణ, ఇండేన్ గ్యాస్ డీలర్ల సంఘం అధ్యక్షుడు గిరిజా శంకర్ పాల్గొన్నారు. గిరిజా శంకర్ మాట్లాడుతూ.. వైరస్ వ్యాప్తి అధికమవుతున్న నేపథ్యంలో.. డెలివరీ బాయ్స్ మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. సిలిండర్ డెలివరీ ఇచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఇవీ చదవండి.... ముదిరిన వివాదం.. ప్రైవేటు కళాశాలలకు ఎన్టీఆర్ వర్సిటీ నోటీసులు