ETV Bharat / state

ముందుగానే పూత, అనుకూలించని వాతావరణం.. ఆందోళనలో మామిడి రైతులు - mango farmers problems news update

కృష్ణా జిల్లాలో మామిడి రైతులు సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ముందుగానే మామిడి పూత రావటం.. రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ప్రస్తుత వాతావరణం మామిడికి అనుకూలంగా లేకపోవడం, పురుగులు, తెగుళ్ళ తాకిడి ఎక్కువగా ఉండటం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం పెట్టుబడి పెరిగిపోతుందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను పలు విధాలుగా ఆదుకుంటే తప్ప గట్టెక్కే పరిస్థితిలో లేదని చెబుతున్నారు.

mango-farmers-problems
ముందుగానే పూత, అనుకూలించని వాతావరణం
author img

By

Published : Dec 9, 2020, 10:02 AM IST

కృష్ణా జిల్లాలో మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏటా రసాలు ముందుగా కాపునకు వచ్చేవి. బంగినపల్లి, సువర్ణరేఖ వంటి ఎగుమతి రకాలు వాటి కన్నా నెల ఆలస్యంగా పూతలు వచ్చేవి. కానీ ఈ ఏడాది రసాల కంటే ముందు సువర్ణ రేఖ, బంగిన పల్లి రకాలు పూతలు రావటం రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే.. ఉగాదికి ముందే.. మామిడి పండ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. నెలరోజులు ముందే మామిడి పూతలు విరబూసాయి.

కానీ పూసిన పూతను కాయలుగా నిలబెట్టుకోవడం కోసం.. ఇప్పటికే నాలుగుసార్లు మందులు పిచికారీ చేశారు. వాతావరణంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకోవడం.. తెనేమంచు పురుగు ప్రభావం ఎక్కువగా ఉందంటున్నారు. వాటి నుంచి కాపును కాపాడుకునేందుకు మరో నాలుగు లేదా ఐదు పిచికారీలు చేయాల్సిన అవసరం ఉందని రైతులు అభిప్రాయ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం పురుగు మందులను సబ్సిడీపై అందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

గతేడాది ప్రభుత్వం మామిడి రైతులకు ఫ్రూట్ కవర్లు ఇవ్వడం వల్ల అధిక నాణ్యతతో మామిడి దిగుబడులు వచ్చాయి. ఈ ఏడాది కూడా ఫ్రూట్ కవర్లు సకాలంలో ఇచ్చి.. తమను ఆదుకోవాలని కోరుతున్నారు. బిందు సేద్యం ద్వారా నేరుగా నీటిని చెట్లకు పారుదల చేస్తే.. తేమ శాతం ఎక్కువై మంగు మచ్చలు వచ్చి.. కాయ నాణ్యత దెబ్బ తినటంతో నష్టపోతున్నామంటున్నారు. రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీతో అందించాలని.. సబ్సిడీ బకాయిలను చెల్లించి రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మామిడి కాయ రవాణాలో నాణ్యత దెబ్బతిని.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఇబ్బంది నుంచి గట్టెక్కేందుకు మామిడి రైతులకు ట్రేలు సబ్సిడీకి అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇవీ చూడండి...

ఉపకార వేతనాల దరఖాస్తు గడువు పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.