ETV Bharat / state

''వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే 30న అసెంబ్లీ ముట్టడి''

ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని సీఎం జగన్ శాసనసభలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వకుంటే ఈ నెల 30న అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఈ నెల 30న అసెంబ్లీ ముట్టడి : మందకృష్ణ మాదిగ
author img

By

Published : Jul 24, 2019, 9:11 PM IST

ఈ నెల 30న అసెంబ్లీ ముట్టడి : మందకృష్ణ మాదిగ

ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని.. అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పడం మాదిగలను అవమానించడమే అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. 10 రోజులు దాటుతున్నా.. సీఎం తన మాటలు ఉపసంహరించుకోకపోవడం సరికాదన్నారు. మాదిగలను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోందని ఆగ్రహించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా రిలే దీక్షలు, నిరసనలకు పిలుపునిచ్చిన ఆయన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఆందోళనలో పాల్గొన్నారు. తెదేపా, భాజాపా నాయకులు మద్దతు ఇచ్చారు. గతంలో జగన్ ఎస్సీ వర్గీకరణకు మద్దతునిచ్చి ఇప్పుడు మాట మార్చారని ఆరోపించారు. జగన్ తమకు సమాధానం చెప్పి వ్యాఖ్యలు ఉపసంహరించుకోక పోతే ఈ నెల 27 వరకు రిలే దీక్షలు చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 30న అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి : చిన్నారి ప్రాణం తీసిన 108 సిబ్బంది సమ్మె..?

Intro:రిపోర్టర్ : కే శ్రీనివాసులు
సెంటర్ : కదిరి
జిల్లా :అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_46_23_Vidyut_Sarphara_Rytula_Aandolana_AVB_AP10004

Body:ప్రభుత్వం ప్రకటించిన విధంగా వ్యవసాయానికి పగటిపూట మాత్రమే విద్యుత్ సరఫరా చేయాలంటూ అనంతపురం జిల్లా కదిరి లోని విద్యుత్ కార్యాలయం వద్ద రైతులు నిరసన తెలిపారు. కదిరి మండలం కె. బ్రాహ్మణపల్లి, ఎగువపల్లి పంచాయితీ పరిధిలోని గ్రామాలకు మూడు వారాల నుంచి రాత్రి వేళలో విద్యుత్ సరఫరా చేస్తున్నారని రైతులు వాపోయారు. సేద్యం పనులకు కూలీలు దొరకడమే కష్టమవుతొందన్నారు.ఇలాంటి పరిస్థితుల్లో రాత్రిపూట విద్యుత్ సరఫరా చేస్తే నాట్లు ఎలా వేసుకోవాలని రైతులు సిబ్బందిని నిలదీశారు రాత్రి వేళల్లో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయడం వల్ల గతంలో లో పలు రైతులు ప్రమాదాల బారిన పడినట్లు రైతులు తెలిపారు.సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సిబ్బంది తప్పించుకున్నారు . అధికారులెవరు అందుబాటులో లేకపోవడంతో తమ డిమాండ్ తో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దారుకు అందజేసి రైతులు వెనుదిరిగారు.

Conclusion:బైట్స్
శ్రీనివాసులు, రైతు
వెంకటరమణ, రైతు
బాబు, రైతు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.