ETV Bharat / state

వ్యవసాయ రుణం పేరిట 5 లక్షలు రూపాయలు దోచారు.. - కృష్ణా జిల్లా తాజా వార్తలు

కృష్ణా జిల్లా కృష్ణలంకకు చెందిన ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు వ్యవసాయ రుణం పేరుతో దోచుకున్నారు. 5 లక్షలు రూపాయలు నష్టపోయినట్లు బాధితుడు తెలిపాడు.

man was robbed
వ్యవసాయ రుణం పేరిట 5 లక్షలు రూపాయలు దోచుకున్న దుండగులు
author img

By

Published : Mar 4, 2021, 4:53 PM IST

వ్యవసాయ రుణం ఇప్పిస్తామని.. ఓ వ్యక్తి నుంచి 5 లక్షలు దోచుకున్నారు దుండగులు. కృష్ణలంక పీఎస్ పరిధిలో బాలాజీ నగర్​కు చెందిన సురేశ్​ కుమార్ వ్యవసాయం చేయాలనుకున్నాడు. నందిగామలో ఉన్న తమ భూమిపై రుణం తీసుకోవాలని యత్నించాడు. ఈ క్రమంలో హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ నుంచి రుణం ఇప్పిస్తామంటూ కొందరు సురేశ్​ను నమ్మించారు . బాధితుడి నుంచి ప్రాసెస్, స్టాంప్ డ్యూటీ.. ఫీజుల పేరుతో సుమారు 5 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. డాక్యుమెంట్స్ ను తీసుకున్నారు. రోజులు గడిచినా లోన్ రాకపోవటంతో.. మోసపోయానని తెలుసుకున్న సురేశ్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండీ..ఎన్నికల వేళ నాటు బాంబుల కలకలం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.