ఆస్తి తగాదాల సమస్య పరిష్కరించాలని కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్‌లో ఒక వ్యక్తి సెల్ ఫోన్ టవర్ ఎక్కి చనిపోతానంటూ బెదిరించాడు. ప్రసాదంపాడుకి చెందిన పొల్లిపాటి భాస్కర్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన గరిమెళ్ళ శ్రీనివాసరావు మధ్యవర్తిత్వం ద్వారా 9 నెలల క్రితం తన పొలాన్ని కొనుగోలు చేశాడని బాధితుడు దొంతుబోయిన గోపి తెలిపాడు. అగ్రిమెంట్ సమయం దాటినా నగదు చెల్లించక పోవడంతో సమస్య పరిష్కరించాలని సెల్ టవర్ ఎక్కాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడు గోపిని దింపే ప్రయత్నం చేస్తున్నారు.
ఆస్తి తగాదా.. 'పరిష్కరిస్తేనే టవర్ దిగుతా' - ఆస్తి తగాదాలు
ఆస్తి తగాదాల విషయమై ఓ వ్యక్తి సెల్ ఫోన్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. కృష్ణ జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్‌లో ఈ ఘటన జరిగింది.