ETV Bharat / state

ప్రమాదవశాత్తు కృష్ణానదిలో పడి వ్యక్తి మృతి - krishna district latest news

ప్రమాదవశాత్తు కృష్ణానదిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం కొత్తపేటలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

man died in kothapeta  krishna district
ప్రమాదవశాత్తు కృష్ణానదీలో పడి వ్యక్తి మృతి
author img

By

Published : Jul 13, 2020, 4:21 PM IST

కృష్ణాజిల్లా, అవనిగడ్డ మండలంలోని కొత్తపేటకు చెందిన కోడూరు ఫణి (38) ప్రమాదవశాత్తు కృష్ణానదిలో పడి మృతి చెందాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఫణి ఎంతసేపటికి రాకపోవడంతో బంధువులు అతని కోసం వెతకసాగారు. చివరికి కొత్తపేట పుష్కరఘాట్ వద్ధ ఫణి సైకిల్ కనిపించడంతో నదిలో ఈత కోసం దిగి మునిగిపోయి ఉంటాడని బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఐదుగురు గజఈతగాళ్లతో పడవ ద్వారా గాలింపు చేపట్టగా మునిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో మృతదేహం నీటిపై తేలింది.

మృతదేహన్ని పోస్ట్​మార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సంఘటన స్థలాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్​బాబు, దివి మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కడవకొల్లు నరసింహారావు పరిశీలించి మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఇదీ చదవండి: ఈ - క్రాప్​తో రైతులకు న్యాయం జరుగుతుంది: వ్యవసాయ శాఖ కమిషనర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.