కృష్ణా జిల్లా నూజివీడు మండం తుక్కుల్లురు గ్రామంలో.. అప్పుల బాధ తాళలేక పురుగులమందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యేసు అనే వ్యక్తి పేకాట కోసం.. గ్రామానికి చెందిన ముగ్గురి వద్ద అప్పు తీసుకున్నాడు. వారంతా అప్పు తీర్చాలని ఒత్తిడి తీసుకురాగా.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకుని.. పురుగులమందు తాగాడు.
తన ఛావుకు వారు ముగ్గురే కారణమని వీడియోలో ఆరోపించాడు. కుటుంబసభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించగా.. చికిత్స తీసుకుంటూ ఏప్రిల్ 23న మరణించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: