కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జయంతి గ్రామం వద్ద నిషేధిత గుట్కాలను అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 60 వేల రూపాయల విలువైన గుట్కాలు, ఖైనీలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై హరిప్రసాద్ తెలిపారు. ఇలాంటి వ్యవహారాలను సహించేది లేదన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి: