ETV Bharat / state

మార్క్​ఫెడ్ అధికారుల తీరు.. మెక్కజొన్న రైతుల అవస్థలు! - కృష్ణాజిల్లా రైతుల కష్టాలు తాజా వార్తలు

కృష్ణా జిల్లా మార్క్​ఫెడ్ తీరుతో మెక్కజొన్న రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొనుగోళ్లలో అధికారులు జాప్యం చేస్తున్న కారణంగా.. తీవ్రంగా నష్టపోతున్నారు. కొనుగోలు షరతులు, రైతు భరోసా కేంద్రాల్లో నమోదు ప్రక్రియ వంటి అంశాలు రైతును ఉక్కిబిక్కిరి చేస్తున్నాయి. చేసేదేమీ లేక దళారులకు పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి.. రైతుకు ఎదురవుతోంది.

maize farmers facing problems
మెక్కజొన్న రైతుల అవస్థలు
author img

By

Published : May 16, 2021, 11:28 AM IST

కృష్ణా జిల్లా మార్క్​ఫెడ్ తీరుతో మెక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఈ క్రాప్​లో పంటను నమోదు చేసుకున్న రైతులే.. మార్క్​ఫెడ్​లో అమ్ముకునే అవకాశం ఉంది. కొందరు ఇప్పటికీ పేర్లు నమోదు చేసుకోని రైతన్నలు.. తీవ్ర ఆవేదనకు లోనవుతన్నారు. కళ్లం నుంచి పంటను రైతు భరోసా కేంద్రానికి తరలించడం.. ఆ తర్వాత మార్క్​ఫెడ్​కు సొంత ఖర్చులతో పంటను తరలించడం రైతకు పెను భారంగా మారుతున్నాయి.

నమోదు చేసుకోవలనే నిబంధన.. రైతు పాలిట శాపం

మార్క్​ఫెడ్​లో పంటను అమ్ముకోవాలంటే.. గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రంలో నమోదుచేసుకోవాలని అధికారులు తేల్చిచెప్పారు. ఇందుకోసం మార్క్​ఫెడ్ అధికారులు పది రోజులకు ఒకసారి షెడ్యూలు ఇస్తున్నారు. ఈ లోపే.. అకాల వర్షాల కారణంగా కళ్ళాల్లోనే పంట ఉండిపోతోంది. దీంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉండిపోతున్నారు. సమయం తక్కువగా ఉండటం.. రైతు భరోసా కేంద్రాలకు తెచ్చిన మొక్కజొన్నలు గోడౌన్​కు తరలించటానికి రవాణా సదుపాయం ఏర్పాటు చేసుకోవడం రైతుకు భారంగా మారనుంది.

సొంత ఖర్చులతో తరలింపు..

మొక్కజొన్నలు తరలించటానికి వేలాది రూపాయలు రవాణా చార్జీలు చెల్లించి రైతులు నష్టపోతున్నారు. మార్క్​ఫెడ్ నుంచి లారీలు రాకపోవడంతో.. చేసేదేమి లేక సొంతంగా ట్రాక్టర్లు, ఇతర వాహనాల సహాయంతో పంటను రైతు భరోసా కేంద్రం నుంచి గోడౌన్​లకు తరలిస్తున్నారు. కొందరైతే దళారులకు అమ్ముకుని నష్టపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. ఇప్పటికే రవాణా చేసుకున్న వాటికి చార్జీలు ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలని.. రైతు భరోసా కేంద్రాల్లో నమోదు ప్రక్రియను త్వరిగతన పూర్తి చేయాలని వేడుకుంటున్నారు.

ఆదుకోని మార్క్​ఫెడ్..

దళారుల నుంచి రైతులు మోసపోకుండా ఉండేందుకు.. మార్క్​ఫెడ్ ద్వారా రైతు నుంచి నేరుగా పంట కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందుకోసం క్వింటాలు ధర రూ.1850గా నిర్ణయించింది. అందులో భాగంగానే మోపిదేవి మండలంలోని మార్క్​ఫెడ్ కేంద్రంలో గతనెల 26న స్థానిక శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అయినా కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

హుస్సేన్​సాగర్​ నీటిలో కరోనా వైరస్​ ..!

మిర్చి రైతుకు కరోనా దెబ్బ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.