కృష్ణాజిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం పంచాయతీ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులకు 10కేజీల బియ్యం, మాస్క్లు, గ్లౌజులు అందజేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికుల సేవలు కొనియాడదగినవని పేర్కొన్నారు. అనంతరం రైతు బజారును సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం మైలవరంలో పోలీస్, రెవెన్యూ సిబ్బందితో కలిసి పర్యటించి.. షట్టర్లు వేసి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న షాపులను గుర్తించి మూసివేయించారు. నిత్యావసర వస్తువులకు సంబంధించినవి తప్ప మిగతా షాపులు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: విశాఖను కలవరపెడుతున్న కరోనా.. ఇప్పటికే 4 పాజిటివ్ కేసులు