రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని మద్య విమోచన ప్రచార కమిటి ఛైర్మన్ లక్ష్మణ రెడ్డి అన్నారు. ధరలు పెరగిన కారణంగా.. విక్రయాలు భారీగా తగ్గాయని ఆయన అన్నారు. మద్యవిమోచన ప్రచార సమితి ఆధ్వర్యంలో పాఠశాలల్లో, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
ప్రస్తుతం కరోనా కారణంగా ప్రచార కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడిందని చెప్పారు. మద్యం వల్ల కలిగే దుష్ఫలితాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు షార్ట్ ఫిల్మ్ పోటీలు ఏర్పాటు చేశామని... ఇప్పటివరకు 38 మంది వీడియోలను పంపారన్నారు. అక్టోబర్ 2 న పోటీల్లో నెగ్గిన వారికి గుంటూరులో బహుమతులు అందజేస్తామని లక్ష్మణరెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి:
ఎస్సై పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతా... హెడ్ కానిస్టేబుల్‌కు టోకరా