రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే జగన్మోహనరావు పేర్కొన్నారు. నందిగామ మండల పరిషత్ కార్యాలయంలో వ్యవసాయ అధికారులకు సచివాలయ సాంకేతిక సిబ్బందికి 'హబ్ లెవెల్ ట్రైనింగ్ ఆన్ ఆపరేషన్' పనులపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
రైతుల అభివృద్ధి, శ్రేయస్సుకోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు. అందులో భాగంగానే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల కోసం ప్రత్యేకంగా డిజిటల్ కియోస్క్ మిషన్లను ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ మిషన్లలో పురుగుమందులు, విత్తనాలు, ఎరువులు ఇతరత్రా వ్యవసాయ పరికరాలను రైతులు నేరుగా కొనుగోలు చేసుకునేందుకు సదుపాయాలను కల్పించారని అన్నారు.