కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పర్యటించారు. వరద ముంపునకు గురైన ప్రాంతాల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. వరదల్లో మునిగిపోయిన పంటలను కలెక్టర్‌తో చర్చించి పెద్ద మొత్తంలో పరిహారం ఇప్పిస్తామని, కౌలు రైతులను ఆదుకుంటామని, రెండో పంటకు కావలసిన విత్తనాలు ఉచితంగా అందిస్తామని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు మెరక ప్రదేశాల్లో ఇళ్ల పట్టాలు ఇస్తామని పేర్కొన్నారు. బాధితుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అన్నివిధాల ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.
ఇదీ చదవండి :