ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో పురుగులమందు తాగి ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి(lovers attempt suicide in krishna district) పాల్పడింది. ఈ ఘటన కృష్ణా జిల్లా చాట్రాయి మండలం ఎర్రవారి గూడెంలో చోటు చేసుకుంది. వాళ్లను నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ముసునూరు మండలంలో పూడికి చెందిన అమ్మాయి.. సమీప బంధువు పశ్చిమగోదావరి జిల్లా కొత్తపల్లికి చెందిన వ్యక్తి ప్రేమించుకున్నట్లు(lovers attempt suicide) ప్రాథమిక సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి..
MURDER ATTEMPT : మద్యం మత్తులో స్నేహితుడిపై హత్యాయత్నం...కేసు నమోదు