కృష్ణా జిల్లా నూజివీడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కంకిపాడు మండలం దావూలూరుకు చెందిన రోషమ్మ హనమంతుల గూడెంలో నివాసం ఉండే కూతురు వద్దకు వచ్చింది. తన మనవరాలిని పాఠశాలలో చేర్పించి తిరిగి ఇంటికి వెళ్తుండగా నూజివీడు గాంధీబొమ్మ సెంటర్లో వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వృద్ధురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించిందని ధృవీకరించారు.
ఇదీచదవండి