Nara Lokesh Yuvagalam Padayatra: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఇప్పటి వరకు 8 ఉమ్మడి జిల్లాలో సాగగా అతి తక్కువగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కేవలం 9 రోజులు మాత్రమే జరిగింది. అన్ని రోజుల పాదయాత్ర గన్నవరం నియోజకవర్గంలోనే ఐదు రోజుల పాటు సాగటం విశేషం. గన్నవరం నియోజకవర్గంలో ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ జెండా ఎగురవేయాలనే పట్టుదల పార్టీశ్రేణుల్లో నెలకొంది. వైసీపీ నుంచి సీనియర్ నేత యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశంలో చేరటం పార్టీకి అదనపు బలాన్ని ఇచ్చింది.
MLA Vamsi Joined YCP from TDP: ఎమ్మెల్యే వంశి పార్టీ వీడి వైసీపీ పంచన చేరినా అతని వెంట తెలుగుదేశం శ్రేణులు ఎవరు వెళ్లకపోవటం.. అటు వైసీపీ స్థానిక శ్రేణుల నుంచి సహకారం లేకపోవటంతో సతమతమవుతున్నారు. ఇదే సమయంలో యార్లగడ్డ పెద్దఎత్తున వైసీపీ శ్రేణులతో తెలుగుదేశంలోకి రావటం నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ నెల 22న భారీ భారంగా సభ నిర్వహణ ద్వారా గన్నవరం గడ్డపై తమ దమ్ము ఏమిటో తెలుగుదేశం గట్టిగా చాటింది. చెంతనే ఉన్న గుడివాడ సీటును కూడా ఈ సారి గెలిచి తీరతామనే ధీమాను నేతలు వ్యక్తం చేశారు. గన్నవరం అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు ఖరారైన్నట్లే.. అతి త్వరలో గుడివాడ అభ్యర్థిని కూడా అధిష్టానం ఖరారు చేయనుంది.
Making Cases Against Telugu Desam Activists: గన్నవరం బహిరంగ సభ విజయంతం తర్వాత వైసీపీ తిరిగి కవ్వింపు చర్యలకు తెరలేపటం తెలుగుదేశం శ్రేణులపై కేసులు పెట్టించటం వంటి చర్యలతో ఆత్మరక్షణ చర్యల్లో పడ్డామని చెప్పకనే చెప్పింది. ప్రకాశం బ్యారేజీ మీదుగా పాదయాత్ర విజయవాడ నగరంలోకి అడుగుపెట్టినప్పుడు పోటెత్తిన ప్రజాధారణ.. విజయవాడ నగర విధుల్లో తలపించిన జన సంద్రోహం మరుసటి రోజు తెల్లవారి నాలుగు గంటల వరకు పాదయాత్ర సాగినా తగ్గని ప్రజాధారణ వంటి ఘటనలచో కృష్ణా జిల్లా తమకు కంచుకోటనే విషయాన్ని బలంగా చాటినట్లయింది. నగరంలోకి పాదయాత్ర ప్రారంభం ముందు నుంచే స్వాగత ఫ్లెక్సిలకు అనుమతి లేదంటూ అధికారులు అడ్డుతగిలినా ఆ ఇబ్బందుల్ని అధిగమిస్తూ ముందుకు సాగారు.
Tension at Nuziveedu: యువగళం పాదయాత్రపై రాళ్లు విసిరిన వైసీపీ కార్యకర్తలు.. టీడీపీ నేతల ఫిర్యాదు
Lokesh Padayatra Successfully Crossed Krishna District: తొలిరోజు విజయవాడ నగర పరిధిలోని 3 నియోజకవర్గాల్లో సాగిన పాదయాత్ర ప్రజాదరణ పోటెత్తితే, మరుసటి రోజు పెనమలూరు నియోజకవర్గం మీదుగా గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశించిన పాదయాత్ర జనసునామీని తలపించింది. అర్ధారాత్రి 3 గంటల సమయంలోనూ మహిళలు రోడ్డు మీదకు వచ్చి స్వాగతం పలికేందుకు ఓపికగా వేచి ఉండటం విశేషం. విజయవాడ, మచిలీపట్టణం పార్లమెంట్ పరిధిలో నేతల మధ్యన ఉన్న సమన్వయ లోపాన్ని లోకేశ్ తన చర్యలతో కాస్త గట్టిగానే వ్యవహరించి చక్కదిద్దారు. గన్నవరం నియోజకవర్గంలో దాదాపు 50 మందికి పైగా నేతలపై కేసులు పెట్టటం వారందరికీ పార్టీ పూర్తీ అండగా నిలవటం నూజివీడులో ఘర్షణలు తలెత్తినా ధీటుగా నిలవటం వంటి చర్యలతో పాదయాత్ర విజయంతంగా ఉమ్మడి కృష్ణా జిల్లాను దాటింది.