గ్రామ సచివాలయ పరీక్ష నిర్వహించింది ఏపీపీఎస్సీనే అని మంత్రులు అంటుంటే... పరీక్ష తాము నిర్వహించలేదని ఏపీపీఎస్సీ చెబుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్వీట్ చేశారు. ఇంతకీ పరీక్ష పెట్టింది ఎవరు.. అని లోకేష్ మండిపడ్డారు. 18 లక్షల మంది యువత భవిష్యత్తుతో ఆటలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు నిర్వహించింది ఎవరు అనేది తెలియదు కానీ, పేపర్ లీకేజి స్కామ్ కి తండ్రి మాత్రం ముఖ్యమంత్రి జగనే అని అన్నారు.
ఇదీ చూడండి: