ఉత్తరాంధ్రకు ఎవరి హయాంలో.. ఏం అభివృద్ది జరిగిందో సాక్ష్యాధారాలతో సహా వివరిస్తామని వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై విమర్శలు చేస్తోన్న తెదేపా నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. అన్ని అంశాల్లోనూ ఈ ప్రాంతాన్ని సీఎం అభివృద్ది చేస్తున్నారన్నారు. అక్కడి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం వేగవంతం చేస్తున్నారన్నారు. విశాఖ రాజధానిగా తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో అక్కడి వారిలో సంతోషం నెలకొందన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న బాబు పోలవరం ప్రాజెక్టు కోసం చేసిందేమీ లేదని, పోలవరం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు సహా తెదేపా నేతలకు లేదని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి జగన్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన లోకేశ్ ఆయనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ను అవమానించిన అచ్చెన్నాయుడు ఆయనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని విజయవాడలో డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ELECTRICITY: జగనన్న కాలనీలు, టిడ్కో నివాసాలకు విద్యుత్ సరఫరాపై ఉన్నతాధికారుల సమీక్ష