చంద్రబాబుపై సామాజిక మాధ్యమాల్లో వైకాపా చేస్తున్న తప్పుడు ప్రచారం పై నారా లోకేశ్ మండిపడ్డారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడిని ఆదుకున్నందుకు రాజేశ్వరి అనే బీసీ మహిళ ఇటీవల చంద్రబాబును కలసి కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను వైకాపా నేతలు సోషల్ మీడియాలో పెట్టి ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేయడాన్ని లోకేష్ తీవ్రంగా ఖండించారు. దొంగలు, అవినీతిపరులు, జైలుపక్షులు, అధికారంలోకి వస్తే ఇలాగే రెచ్చిపోతారని విమర్శించారు. వైకాపా నేతల వ్యాఖ్యలు... సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. ఒక బీసీ మహిళను అవమానించిన మాట్లాడటంపై... పార్టీపెద్దగా జగన్ సమాధానం చెప్పాలని లోకేశ్ డిమాండ్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో విమర్శలు పోస్టులతో ఆవేదనకు గురైన రాజేశ్వరి వీడియోను లోకేష్ తన ట్విట్టర్లో పోస్టు చేశారు.
ఇది కూడా చదవండి.