మోసానికి మరో పేరు జగన్ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. మ్యానిఫెస్టోలో నవ రత్నాలు అని పెద్దగా రాసి.. చివర్లో షరతులు వర్తిస్తాయని కనపడకుండా రాశారని దుయ్యబట్టారు. రైతు భరోసా పేరుతో రైతులను దగా చేశారని లోకేశ్ మండిపడ్డారు. కేంద్రం రైతులకు ఇచ్చే సహాయంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు 12,500 ఇస్తుంది అని హామీ ఇచ్చిందన్న లోకేశ్.. ఇప్పుడు 5 వేలు కోత పెట్టి కేవలం 7,500 ఇస్తున్నారని మండిపడ్డారు.
ఒక్కో రైతన్నకు ఐదేళ్లలో చేస్తున్న దగా 25 వేల రూపాయలని తెలిపారు. కరోనా దెబ్బ, వైకాపా ప్రభుత్వ అసమర్థత వల్ల పండిన పంటకి గిట్టుబాటు ధర లేక రైతు కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా జగన్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతీ రైతుకు ఏడాదికి లక్ష రూపాయిలు లబ్ది చేకూరేలా చేస్తామన్న జగన్ మరో రత్నం కూడా జారిపోయిందని ఆక్షేపించారు.
ఇదీ చదవండి: తడిసిన నయనం.. ఆగని పయనం