విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెదేపా ముఖ్యనేత నారా లోకేశ్ జన్మదిన వేడుకలు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నేతలు పట్టాభి, గొట్టిపాటి రఘు ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. లోకేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధులు, మహిళలకు పండ్లు పంపిణీ చేశారు.
చీపురుపల్లిలో...
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో లోకేశ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. చీపురుపల్లి తెదేపా ఇన్‌ఛార్జి కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఇవీ చదవండి