నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెరిగింది. దీనికి ఆమోదం లభించింది. రాజధానిలోని 29 గ్రామాల్లో భూముల ధరల పెంపు ప్రతిపాదనల దస్త్రానికి సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. దీంతో ఆగస్టు ఒకటో తేదీ నుంచి కొత్త ధరల ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గజం ధర రూ.వెయ్యి ఉండగా... రూ.2,500కు పెంచారు. రూ.2,500 ఉన్నచోట రూ.5 వేల వరకు పెరిగాయి. రాజధానియేతర ప్రాంతాల్లో ఈ స్థాయిలో పెంచలేదు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా సగటున రూ.200 నుంచి రూ.2 వేలకు మించి పెంపుదల లేదు.
రాజధానిలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపు - Increase land registration value in the andhrapradesh capital
అమరావతిలో భూముల రిజిస్ట్రేషన్ విలువను పెంచేందుకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి కొత్త ధరల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరిపేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది.
![రాజధానిలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3918307-thumbnail-3x2-ss.jpg?imwidth=3840)