గుంటూరు జిల్లా ధూళిపాళ్ల నుంచి సత్తెనపల్లికి మద్యం తరలిస్తున్న వ్యక్తి పట్టుబడ్డాడు. నాగరాజు నాయక్ అనే వ్యక్తి సత్తెనపల్లిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో పని చేస్తున్నాడు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న కారణంగా సత్తెనపల్లిలో మద్యం షాపులు మూసివేశారు. దీంతో అతను ధూళిపాళ్ల నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి పట్టణంలో అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. ద్విచక్రవాహనంపై మద్యం తరలిస్తుండగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి...