పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా మద్యం అక్రమ రవాణా ఆగడంలేదు. మద్యం రవాణా చేసేందుకు వ్యక్తులు కొత్తదారులు వెతుకుతున్నారు. వాహనాల ద్వారా తరలిస్తే పట్టుబడుతారని.. గోనెసంచుల్లో వేసుకుని నడుచుకుంటూ తీసుకొస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా జొన్నలగడ్డ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 294 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి...