ETV Bharat / state

తెలంగాణ మద్యం పట్టివేత.. నలుగురు అరెస్టు - telangana ap borders latest liquor news

తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న నలుగురిని ప్రత్యేక నియంత్రణ శాఖ సిబ్బంది పట్టుకున్నారు. 177 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

liquor caught in andhra telangana border and 4 people were arrested
అక్రమ మద్యం తరలిస్తున్ననలుగురిని పట్టుకున్న పోలీసులు
author img

By

Published : May 24, 2020, 4:46 PM IST

కృష్ణా జిల్లాలోని తెలంగాణ సరిహద్దులో.. ప్రత్యేక నియంత్రణ బ్యూరో పెద్దిరాజు ఆధ్వర్యంలో ఎస్సై బాలాజీ, సిబ్బంది అక్రమ మద్యం వ్యాపారులపై దాడులు చేశారు. చండ్రుగూడెం, మొర్సుమల్లి గ్రామాల్లో అక్రమంగా ఆ రాష్ట్రం నుంచి తరలిస్తున్న మద్యం వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 177 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 4 వాహనాలను సీజ్ చేసి... నలుగురిపై కేసు నమోదు చేశామని చెప్పారు.

ఇక నుంచి ప్రత్యేకంగా ప్రభుత్వం నియమించిన ప్రత్యేక నియంత్రణ బ్యూరో ద్వారా అక్రమ మద్యం, అక్రమ ఇసుక చేస్తున్న వారిపై ప్రతిరోజూ దాడులు జరుగుతాయని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో మద్యం తక్కువ ధరకు వస్తుందని.. ఆ రాష్ట్రానికి వెళ్లి మద్యం సేవించి ఇటువైపు తేవాలని ప్రయత్నించినా, అక్రమ మద్యం వ్యాపారం చేయాలని చూసినా.. కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

ఇదీ చదవండి:

అక్రమ మద్యం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.