చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం కె.బి.ఆర్.పురం లో వైకాపా నాయకుడు నాగేశ్వరరాజు ఇంట్లో దాచి ఉంచిన 65 కేసులు మద్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీటి విలువ సుమారు రూ. 3 లక్షల 75 వేల వరకు ఉంటుందని తెలిపారు. పోలింగ్ రోజున ఓటర్లకు సరఫరా చేసేందుకు ఈ మద్యాన్ని నిల్వ ఉంచినట్లు నిర్ధరించారు.
కృష్ణాజిల్లా ఉప్పలూరు రైల్వే గేటు వద్ద 3వేల 264 మద్యం సీసాలతో వెళ్తున్న ఆటోను పట్టుకున్నారు. గుడివాడ నుంచి గన్నవరంకు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి.