అమరావతి పోరాటంలో.... రైతులు మరో ముందడుగు వేశారు. భూములిచ్చిన తమకు న్యాయం జరగకుంటే... కారుణ్య మరణానికి అనుమతినివ్వాలంటూ... రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖలు రాశారు. 3 రాజధానుల నిర్ణయంతో ఉన్నపళంగా రోడ్డున పడ్డామని.... ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతిని అంగీకరిస్తూ.... శాసనసభలో అన్ని పార్టీలూ ఏకగ్రీవ తీర్మానం చేశాయని లేఖలో ప్రస్తావించారు. భూములిచ్చిన తమను..... 2019 ఎన్నికల ప్రచారంలో జగన్ అభినందించిన విషయాన్ని గుర్తుచేశారు. రాజధానిని విశాఖకు స్వలాభం కోసం తరలించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రైతుల త్యాగాన్ని హేళన చేస్తూ.... కులం, మతం, ప్రాంతం అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెయిడ్ ఆర్టిస్టులంటూ అవమానిస్తూ... అరెస్టు చేయిస్తున్నారని మండిపడ్డారు. రాజధానే తరలిపోతే..... తాము జీవచ్ఛవాలుగా మిగిలిపోతామన్న రైతులు.... ఈ బతుకులు తమకొద్దంటూ..... కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు.
కారుణ్య మరణానికి అనుమతించండి.. రాష్ట్రపతికి రాజధాని రైతుల లేఖ - అమరావతి రైతుల ఆందోళనలు
![కారుణ్య మరణానికి అనుమతించండి.. రాష్ట్రపతికి రాజధాని రైతుల లేఖ కారుణ్య మరణానికి అనుమతించండి.. రాష్ట్రపతికి రాజధాని రైతుల లేఖ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5552629-664-5552629-1577806161143.jpg?imwidth=3840)
19:55 December 31
కారుణ్య మరణానికి అనుమతించండి.. రాష్ట్రపతికి రాజధాని రైతుల లేఖ
19:55 December 31
కారుణ్య మరణానికి అనుమతించండి.. రాష్ట్రపతికి రాజధాని రైతుల లేఖ
అమరావతి పోరాటంలో.... రైతులు మరో ముందడుగు వేశారు. భూములిచ్చిన తమకు న్యాయం జరగకుంటే... కారుణ్య మరణానికి అనుమతినివ్వాలంటూ... రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖలు రాశారు. 3 రాజధానుల నిర్ణయంతో ఉన్నపళంగా రోడ్డున పడ్డామని.... ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతిని అంగీకరిస్తూ.... శాసనసభలో అన్ని పార్టీలూ ఏకగ్రీవ తీర్మానం చేశాయని లేఖలో ప్రస్తావించారు. భూములిచ్చిన తమను..... 2019 ఎన్నికల ప్రచారంలో జగన్ అభినందించిన విషయాన్ని గుర్తుచేశారు. రాజధానిని విశాఖకు స్వలాభం కోసం తరలించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రైతుల త్యాగాన్ని హేళన చేస్తూ.... కులం, మతం, ప్రాంతం అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెయిడ్ ఆర్టిస్టులంటూ అవమానిస్తూ... అరెస్టు చేయిస్తున్నారని మండిపడ్డారు. రాజధానే తరలిపోతే..... తాము జీవచ్ఛవాలుగా మిగిలిపోతామన్న రైతులు.... ఈ బతుకులు తమకొద్దంటూ..... కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు.
TAGGED:
అమరావతి రైతుల ఆందోళనలు