ETV Bharat / state

"అమరావతిని కొనసాగిస్తామని స్పష్టమైన ప్రకటన చేయాలి" - రాజధాని అమరావతి వార్తలు

రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ విజయవాడ సీపీఎం కార్యాలయంలో రామకృష్ణ, మధు నిరసన చేశారు. ప్రభుత్వం అమరావతిని కొనసాగిస్తామని స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో వామపక్షాల రాష్ట్ర కార్యదర్శులు నిరసన

author img

By

Published : Aug 5, 2020, 5:18 PM IST

రాజధాని అమరావతిలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో వామపక్షాల రాష్ట్ర కార్యదర్శులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జగన్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని భాజపాతో కలిసి డ్రామాలు ఆడుతున్నారని రామకృష్ణ మండిపడ్డారు. ప్రభుత్వం అమరావతిని కొనసాగిస్తామని స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేసారు.

కరోనా తీవ్రంగా ఉంటే దాన్ని పట్టించుకోకుండా రాజధాని అంటూ ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే 1500 మంది చనిపోయారని ఆరోగ్యశ్రీ అంటే చికిత్స చేయడం లేదన్నారు. అమరావతిని కొనసాగించాలి, ఉత్తరాంద్ర, రాయలసీమ అభివృద్ధికి నిధులు కేటాయించాలని మధు డిమాండ్ చేశారు.

ఆ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని గతంలో చెప్పినా..ఇంతవరకు అమలు జరగలేదన్నారు. రాయలసీమ, ఉతరాంధ్రకు నిధులు కేటాయించలేదన్నారు. రాజధాని గాఢ అంధకారంలోకి వెళ్ళిందన్నారు. తెదేపా మీద రాజకీయంగా వ్యతిరేకత ఉంటే దానిపై చూసుకోవాలి కానీ రాజధానిపై కాదన్నారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు అభివృద్ధికి తీవ్ర ఆటంకంగా మారాయన్నారు.

సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో వామపక్షాల రాష్ట్ర కార్యదర్శులు నిరసన
సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో వామపక్షాల రాష్ట్ర కార్యదర్శులు నిరసన

ఇవీ చదవండి

ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో సీఎం అబాసుపాలు: చినరాజప్ప

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.