కృష్ణాజిల్లా విస్సన్నపేట మండలంలోని వేమిరెడ్డిపల్లి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద కారులో తరలిస్తున్న భారీ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. అనుమానాస్పదంగా వెళుతున్న కారుని తనిఖి చేయగా రూ. 5 లక్షల విలువైన 2513 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నలుగురు నిందితులు, కారుని అదుపులోకి తీసుకున్నట్లు నూజివీడు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో మద్యం పట్టుకున్న విస్సన్నపేట పోలీసు సిబ్బందిని అభినందించారు.
ఇదీ చదవండి జిల్లాలో అక్రమ మద్యంపై పోలీసుల వరుస దాడులు