శ్రీలంకలోని కొలంబోలో జరిగిన బాంబు దాడి బీభత్సం ఆ దేశాన్నే కాదు.. పక్క దేశాలనూ వణికిస్తోంది. పేలుళ్లలో 200కు పైగా మృతి చెందారు. వీరిలో ఆ దేశస్థులే కాక విదేశీయులూ ఉన్నారు. మరెంతమందో క్షతగాత్రులయ్యారు. వీరిలో మన దేశం వారూ ఉన్నారు. ఆ పేలుళ్ల నుంచి రాష్ట్రానికి చెందిన అనంతపురం వాసులు బయటపడగా.. తాజాగా కృష్ణా జిల్లా విజయవాడ వాసులు తృటిలో తప్పించుకున్నారని సమాచారం అందింది. కొలంబోలోని హోటల్ నుంచి వారు బయటకు వచ్చిన వెంటనే ఈ పేలుడు సంభవించింది. వారు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. వారి క్షేమ సమాచారం కుటుంబ సభ్యులకు అందించారు.
ఇవీ చదవండి..