విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో కుల వివక్ష పోరాట సమితి, ఐద్వా ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పరువు హత్యలను నిరోధించడానికి కఠినమైన చట్టం చేయాలని డిమాండ్ చేసింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ఊసరపెంట గ్రామానికి చెందిన హేమావతి అనే యువతి ప్రేమ వివాహం చేసుకుందనే కారణంతో సొంత తల్లిదండ్రులే అత్యంత కిరాతకంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కుల వివక్ష పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి అన్నారు.
ఇదీ చదవండి : ఊసరపెంట పరువు హత్య కేసులో నిందితులు అరెస్టు