కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆర్అండ్బీ కార్యాలయం ముందు సీపీఐ నేతలు ధర్నా చేశారు. ముక్కుపిండి వాహన టాక్సులు వసూలు చేస్తూ రోడ్డు నిర్మించడంలో అలసత్వం వహించడం దారుణం అని సీపీఐ రాష్ట్ర నాయకుడు నాగేశ్వరరావు అన్నారు.
సొంత నిధులు కేటాయించైనా స్థానిక శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ అధికారులకు వినతిపత్రం అందించారు. లేకపోతే నియోజకవర్గంలో అన్ని రోడ్లను దిగ్బంధం చేసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'సుబాబుల్, జామాయిల్ రైతు సమస్యలపై కలిసికట్టుగా పోరాటం చేయాలి'