లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పాడిరైతులకు కృష్ణా మిల్క్ యూనియన్ అండగా నిలిచింది. తిరువూరు మండలం లక్ష్మీపురం పాల శీతల కేంద్రం పరిధిలోని పాల ఉత్పత్తి దారుల సంఘాల్లో సభ్యులుగా ఉన్న పాడిరైతులకు రూ. 2.50 కోట్లను బోనస్ రూపంలో మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని యూనియన్ జిల్లా డైరెక్టర్ బోయపాటి సుశీల.. లక్ష్మీపురం పాల శీతల కేంద్రం మేనేజర్ ఉదయ కిరణ్కు అందజేశారు. పాడిరైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బోనస్ ఇచ్చినట్లు ఆమె తెలిపారు.
ఇవీ చదవండి: