ETV Bharat / state

అంతకంతకూ పెరుగుతున్న కరోనా ఉద్ధృతి

కృష్ణా జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. జిల్లాలో మొదటి వంద కేసుల నమోదుకు 35 రోజుల సమయం పడితే... రెండో వంద కేసులకు మూడు రోజులే పట్టింది. మరో ఎనిమిది రోజుల వ్యవధిలో 3 వందల కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నమోదవుతోన్న కేసుల్ని విశ్లేషిస్తే నెమ్మదిగా మొదలై సామాజికంగా వడివడిగా వ్యాప్తి చెందుతున్నట్లే కనిపిస్తోంది.

krishna district registers 14 more corona cases

author img

By

Published : May 6, 2020, 9:45 PM IST

కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ తీవ్రత తగ్గడం లేదు. బుధవారం మరో 14 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు సంఖ్య 300కు చేరింది. మార్చి 21వ తేదీన ఫ్రాన్స్‌ నుంచి విజయవాడ వచ్చిన ఓ యువకునిలో కరోనా వైరస్‌ మొదటిసారి బయటపడింది. ఆ తర్వాత మార్చి నెలాఖరు వరకు మొత్తం ఆరు కేసులే నమోదయ్యాయి. ఏప్రిల్‌ 24వ తేదీకి జిల్లాలో వంద కేసులు దాటాయి. ఏప్రిల్‌ 27వ తేదీ నాటికి 200కు చేరింది.

విజయవాడకు చెందిన ఇద్దరు వ్యక్తుల నిర్లక్ష్యం, అవగాహన లేమి కారణంగా పాటిజిటివ్​ కేసుల సంఖ్య వేగంగా 200లు దాటింది. అప్పటి నుంచి విజయవాడ నగరంలో వైరస్‌ సామాజిక వ్యాప్తి ఆరంభమైంది. కేసుల సంఖ్య పెరుగుతూ వెళ్తోంది. అందువల్లే మరో వంద కేసులు ఎనిమిది రోజుల్లో నమోదయ్యాయి. వీటిలోనూ ఎక్కువ కేసులు విజయవాడలోనే ఉన్నాయి.

జిల్లాలోని మొత్తం కరోనా బాధితుల్లో 117 మంది డిశ్ఛార్జ్​ అయ్యారు. 173 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం 15,562 మంది అనుమానితుల నుంచి నమూనాలను సేకరించి పరీక్షించారు. వీరిలో 2295 మంది నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

ఇదీ చదవండి

నరసరావుపేటలో ఏం జరుగుతోంది... మిషన్- 15‌ అంటే ఏమిటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.