సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయి..
తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను... పామర్రు నియోజకవర్గ ప్రజలకు అందించడంలో సఫలం అయ్యానని ధీమాగా చెప్తున్నారు.... ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన.! నియోజకవర్గానికి వివిధ పథకాల కింద ఐదేళ్లలో చేసిన ఖర్చును మీడియా సమావేశంలో వెల్లడించారు.
పామర్రు అభివృద్ధి తార్కాణాలు:
-
ఐదేళ్లలో రూ.450 కోట్ల విలువైన పనులు
-
30,318 మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు
-
86,826 మంది రైతులకు రూ.91.75 కోట్ల రుణమాఫీ
-
6315 మందికి రూ.77.43 కోట్ల పసుపు-కుంకుమ
-
రూ.7.4 కోట్లతో 749 మందికి చంద్రన్న బీమా
-
సీఎం సహాయ నిధి ద్వారా 821 మందికి రూ.5.6 కోట్ల లబ్ది
-
రూ.76.57 కోట్లతో 5105 ఎన్టీఆర్ గృహాల నిర్మాణం
-
సీసీరోడ్లు, తాగునీటి సౌకర్యాలకు గణనీయంగా నిధులు
-
పెథాయ్ తుపానుకు తడిసిన ధాన్యం కొనుగోలు
-
రూ. 30 కోట్లతో తోట్లవల్లూరు-పాముల్లంక బ్రిడ్జి
-
ఇంటింటికీ కుళాయి పథకానికి రూ.104.5 కోట్లు
పంచాయతీల సమూల మార్పు...
పామర్రు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజల్లోనూ... సంతృప్తి వ్యక్తం అవుతోందని చెబుతున్నారు. ఐదేళ్లలో పంచాయతీల్లో సమూల మార్పులు వచ్చాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి.