ETV Bharat / state

కేసుల విజృంభణ... అధిక జనం

కరోనా కేసుల ఉద్ధృతి.. అధిక జన సాంద్రతను దృష్టిలో పెట్టుకుని... కృష్ణా జిల్లాను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. శుక్రవారం కొత్త కేసులు నమోదు కానప్పటికీ..మొత్తం కేసుల సంఖ్య అధికంగా ఉన్నందున...గ్రీన్‌జోన్లలోనూ వెసులుబాట్లకు తావివ్వలేదు. లాక్‌డౌన్‌ కారణంగా జిల్లాలో నిలిచిపోయిన ఇతర ప్రాంతాల వలస కూలీలను.. స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేపట్టారు. ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరిస్తేనే జిల్లా గ్రీన్‌జోన్‌లోకి రావడం సాధ్యమని అధికారులు అంటున్నారు.

krishna district in RED ZONE
రెడ జోన్ గా కృష్ణా జిల్లా
author img

By

Published : May 2, 2020, 8:57 AM IST

కృష్ణా జిల్లాలో మొత్తం 11,192 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. వాటిలో 246 మందికి పాజిటివ్‌ తేలిందని తెలిపారు. 37 మంది డిశ్ఛార్జ్ కాగా... 201 మంది వైద్యం పొందుతున్నారు. మరో వెయ్యీ 393 మంది నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. జిల్లాలో మొత్తం 34 క్వారంటైన్ కేంద్రాల్లో 621 మందిని పర్యవేక్షిస్తున్నారు. ఏప్రిల్ 24 నుంచి 30 వరకూ జిల్లాలో ఏకంగా 180 కేసులు నమోదు కాగా... గురువారం ఉదయం 10 గంటల నుంచి శుక్రవారం ఉదయం వరకూ ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కాలేదు.

జిల్లాలో మార్చి 21న తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాగా... ఆ సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ 246కు చేరింది. ఇందులో సింహభాగం విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోనివే. ఫలితంగా నగరాన్ని అధికారులు 19 క్లస్టర్లుగా విభజించారు. ఇందులో కృష్ణలంక, కార్మికనగర్‌, అజిత్‌సింగ్‌ నగర్లలోనే... 120కిపైగా పాజిటివ్‌ కేసులు నిర్ధరించారు. కొందరికి వైరస్ ఎలా సోకిందో ఇప్పటివరకూ తేలకపోగా...అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు.

నమోదైన కేసుల ఆధారంగా విజయవాడ, మచిలీపట్నం నగరపాలక సంస్థలను పూర్తిగా రెడ్‌జోన్లుగా ప్రకటించారు. వీటితో పాటు గుడివాడ, తిరువూరు, కొండపల్లి, పెడన, ఉయ్యూరు, నందిగామ, జగ్గయ్యపేట, నూజివీడు పురపాలికలనూ రెడ్‌జోన్లుగా గుర్తించారు. విజయవాడ నగరంలోని తూర్పు, పశ్చిమ, ఉత్తర, మధ్య నియోజకవర్గాల పరిధిలో ఉన్న మండలాలు... విజయవాడ మండలం సహా మచిలీపట్నం, నందిగామ, జగ్గయ్యపేట, నూజివీడు, కైకలూరు, కలిదిండి, కంకిపాడు, చందర్లపాడు, వత్సవాయి, పెనమలూరు, పెనుగంచిప్రోలు మండలాలను రెడ్‌జోన్లుగా నిర్ణయించారు. ఈ ప్రాంతాల ప్రజలకు లాక్‌డౌన్‌ నుంచి ఎలాంటి మినహాయింపులూ ఉండబోవని అధికారులు స్పష్టం చేశారు.

రెడ జోన్ గా కృష్ణా జిల్లా

ఇదీ చదవండి...రెడ్​జోన్​లో ఆ ఐదు జిల్లాలు...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.