మామ మృతిచెందిన విషాదంలోనూ కర్తవ్యమే దైవంగా భావించారు కృష్ణా జిల్లా కలెక్టరు ఏఎండీ ఇంతియాజ్. ఆయన మామ( కలెక్టరు సతీమణి తండ్రి) డాక్టర్ ఇస్మాయిల్ హుస్సేన్ కర్నూలులో మంగళవారం గుండె సంబంధ వ్యాధితో మరణించారు. జిల్లాలో కరోనా నియంత్రణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న తరుణంలో ప్రజల ఆరోగ్యానికే కలెక్టర్ ప్రాధాన్యం ఇచ్చారు. అంత విషాదంలోనూ కర్నూలుకు వెళ్లకుండా తన కర్తవ్యానికే మొగ్గుచూపారు. మంగళవారం నిర్వహించిన సమావేశాలు, సమీక్షల్లో ఆయన పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'దిల్లీ నుంచి వచ్చిన వారు వివరాలు చెప్పాలి'