కృష్ణా జిల్లాలో కరోనా పరీక్షలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ప్రజా రవాణా సంస్థ రూపొందించిన మూడు సంజీవని బస్సులను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ విజయవాడలో ప్రారంభించారు. దేశంలో అత్యధికంగా పరీక్షలు నిర్వహించిన జిల్లాల్లో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉందని- ఈ పరీక్షల సామర్ధ్యాన్ని మరింత పెంచేందుకు అవసరమైన చోట సంజీవని బస్సులను వినియోగిస్తామన్నారు. ప్రతి బస్సులోనూ పది మంది సాంకేతిక సిబ్బంది ఉంటారని... ఒకేసారి పది పరీక్షలు చేసేందుకు వీలుందన్నారు. 45 రోజులుగా పరీక్షల సంఖ్య బాగా పెరిగిందన్నారు.
మరోవైపు జిల్లాలోని జగ్గయ్యపేటలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక పరీక్షా శిబిరం జనం రద్దీతో గందరగోళంగా మారింది. తొలుత బస్టాండ్ లో ఏర్పాటు చేసిన కొవిడ్ పరీక్షల ప్రత్యేక బస్సును అనంతరం అన్నా క్యాంటీన్ ప్రాంతలోకి మార్చారు. అక్కడ ఆవరణ చిన్నది కావటంతో జనాలు ఇబ్బందుల పడ్డారు. విశాలమైన స్థలంలోకి మార్చాలని ప్రజలు కోరుతున్నారు