ETV Bharat / state

'ప్రత్యేక జాగ్రత్తలతో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల నిర్వహణ' - collector intiaz latest news

పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షలను నిర్వహించామని కలెక్టర్​ ఇంతియాజ్​ పేర్కొన్నారు. పరీక్ష గదిలో 12 మంది అభ్యర్థులను మాత్రమే అనుమతించేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు.

krishna district collector on gram sachivalayam exams
కృష్ణా జిల్లా కలెక్టర్​ ఇంతియాజ్
author img

By

Published : Sep 28, 2020, 11:50 PM IST

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న 1425 ఖాళీలను భర్తీ చేసేందుకు జిల్లా వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించామని కలెక్టర్​ ఇంతియాజ్​ తెలిపారు. 1.19 లక్షల మంది పోస్టులకు దరఖాస్తు చేసుకోగా... 87,136 మంది పరీక్షలకు హాజరయ్యారని ఆయన చెప్పారు.

కొవిడ్​-19 కారణంగా పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. గదికి 12 మంది అభ్యర్థులను మాత్రమే అనుమతించామన్నారు. పరీక్షలకు 8 మంది కొవిడ్​ బాధితులు హాజరయ్యారని తెలియజేశారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు వచ్చేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

'గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలకు పక్కా భవనాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.