కృష్ణాజిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు కృషిచేస్తున్నారు . విదేశాల్లో చిక్కుకున్న కృష్ణాజిల్లా విద్యార్థులు ప్రత్యేక విమానాల ద్వారా రానున్నారని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. వారు జిల్లాకు రాగానే వైద్య పరీక్షలు నిర్వహించి.. క్వారంటైన్‌కు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం సరఫరాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసామని అన్నారు. నాలుగు రోజుల్లోనే 2వేలకు పైగా మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు.
'నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలే' - liquor news in krishna district
కృష్ణాజిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని ఎస్పీ రవీంధ్రనాథ్ బాబు అన్నారు. ప్రత్యేక విమానంలో విదేశాల నుంచి వస్తున్న విద్యార్థులను క్వారంటైన్‌కు తరలిస్తామని ఆయన తెలిపారు.