ఇవీ చూడండి.
అనుమతి లేనిదే ఏది అప్‌లోడ్ చేయొద్దు...! - ap elections 2019
ఎన్నికల నియమావళి ప్రకారం సామాజిక మాధ్యమాలనూ ఎలక్ట్రానిక్ మీడియాగానే పరిగణించనున్నారు. ప్రసార మాధ్యమాలకు ఉన్న నిబంధనలన్నీ వీటికీ వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్
ప్రసార మాధ్యమాలకు వర్తించే నియమాలన్నీ సామాజిక మాధ్యమాలకూ వర్తిస్తాయని కృష్ణా జిల్లా పాలనాధికారి ఇంతియాజ్ వెల్లడించారు. అభ్యర్థులు అఫిడవిట్లో వారి సామాజిక మాధ్యమాల ఖాతాలకు సంబంధించిన వివరాలు పొందుపరచాలని ఆయన సూచించారు. సామాజిక మాధ్యమాల్లో ఏదైనా అప్లోడ్ చేసేముందు మీడియా మానిటరింగ్ సెల్ నుంచి అనుమతులు తీసుకోవాలని ఇంతియాజ్ తెలిపారు. అనుమతులు లేకుండా ఎన్నికలకు సంబంధించిన ఏదైనా అంశాన్ని ప్రసారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇవీ చూడండి.