పాలనలో అన్ని విధాలుగా విఫలమైన వైకాపా ప్రభుత్వం... వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని మాజీఎంపీ కొనకళ్ల నారాయణ మండిపడ్డారు. ప్రతి శుక్రవారం కోర్టు మెట్లెక్కే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టమన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలపై బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు. ఇసుక, మద్యం పేరుతో వైకాపా నేతలు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తెదేపా పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందితే... జగన్ పాలనలో తిరోగమనంలోకి వెళ్తోందని ఆక్షేపించారు.
ఇదీ చదవండి: 'ఏపీ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా దెబ్బతీస్తున్నారు'